హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
బేగంపేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రేస్ సీనియర్ నాయకులు విశాల్, త్రికాల మనోజ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన గాని ఆలోచన గానీ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది స్పష్టంగా చెప్పడం జరిగింది.
అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజకీయ లబ్ది కోసం లేని బూచిని ఉన్నదని అమాయక ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని తెలిపారు. మీ ప్రభుత్వ హయాంలో 33జిల్లాలు ఏర్పాటు చేశారు. అప్పుడు మీరే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నారు. అప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడుగలేదని వారు ప్రశ్నించారు.
అఖిలపక్ష శాంతి ర్యాలీ పేరిట అనుమతులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ తీసే ప్రయత్నం చేస్తేనే పోలీసులు అనుమతి నిరకరించారని తెలిపారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు.
#sidhumaroju
