పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38) ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వస్తూ కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు.
ఆయనకు ఒక కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. శ్రీనివాసుల భార్య పద్మావతి, కుటుంబ కలహాల కారణంగా సంవత్సరం క్రితం భర్తను, పిల్లలను వదిలి వెళ్లిపోయారు.
శ్రీనివాసుల మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
# కొత్తూరు మురళి.




