రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద లంకెపల్లి వారిపల్లికి చెందిన శివ బైకు మీద వస్తుండగా వెనుక నుంచి మరో బైకు వచ్చి ఢీకొంది.
ఈ ఘటనలో శివ కాలు విరగడంతో బాధితున్ని స్థానికుల సహాయంతో కుటుంబీకులు 108 వాహనంలో పీలేరు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.




