బీజాపూర్ ఎన్కౌంటర్ కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి*
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు ముఖ్య నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
పాపారావుపై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. దక్షిణ బస్తర్ వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన అతడు అనేక దాడులకు సూత్రధారుడిగా ఉన్నాడు. ఘటనాస్థలంలో రెండు AK-47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.




