కర్నూలు :
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కోడుమూరు నియోజకవర్గ ఎంఎల్ఏ శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈరోజు విజయవాడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని, రాజకీయాల్లో విలువలు, ఆత్మగౌరవాన్ని పెంపొందించిన అపూర్వ వ్యక్తిత్వం అని కొనియాడారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంకు ఛైర్మెన్ వెంకట్రాముడు , కర్నూలు పార్లమెంట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బోగినీ నాగేంద్ర ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






