Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు

ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు

ఏపీ మెడికల్ కౌన్సిల్ లో ఖాళీగా ఉన్న సభ్యులకు ఎన్నికలు*
20 ఏళ్ల తర్వాత వైద్య మండలి సభ్యుల ఎన్నిక*
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ* ఫిబ్రవరి 9 న ఆన్ లైన్ ద్వారా ఓటింగ్..10 న ఫలితాల వెల్లడి*

*- రిటర్నింగ్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కేవీఎన్ చక్రధర్ బాబు*

రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో 13 మంది సభ్యులకు ఎన్నికలను ఫిబ్రవరి 09 వ తేదీన ఆన్ లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని సెకండరీ హెల్త్ డెరెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్, కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు.

స్థానిక తాడేపల్లి సెకండరీ హెల్త్ డెరెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏపీఎంసీ – 2026 ఎన్నికల ప్రక్రియపై సెకండరీ హెల్త్ డెరెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్, కేవీఎన్ చక్రధర్ బాబు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గౌరవ హైకోర్టు 6 వారాల్లోపు ఏపీ మెడికల్ కౌన్సిల్ లో (ఏపీఎంసీ) 13 మంది సభ్యులకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీఎంసీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.

మెడికల్ కౌన్సిల్ చరిత్రలో తొలిసారిగా ఆన్ లైన్ (ఈ-ఓటింగ్) పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చట్టం (1968) ప్రకారం రిజిస్టర్ అయిన ఎంబీబీఎస్ ఆపైన అర్హత కల్గిన డాక్టర్లు ఓటు వేసేందుకు అర్హులన్నారు. గత నెల రోజుల్లో 316 మంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 1871 మంది రిజిస్ట్రేషన్ పునరుద్దరణ (రెన్యువల్) చేసుకున్నారని, ప్రస్తుతం 55,504 మంది వైద్యులు ఓటర్ల జాబితాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.

రాష్ట్ర వైద్య మండలి (ఏపీ మెడికల్ కౌన్సెల్) సభ్యుల ఎంపిక కోసం వచ్చేనెల 9న ఆన్లైన్ ద్వారా ఎన్నికలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధర బాబు వెల్లడించారు. మండలి చట్టంలో సెక్షన్ 3 (2) (బి) కింద నిర్దేశించిన 13 మంది సభ్యుల ఎంపిక కోసం ఎన్నికల నోటిఫికేషన్ ను సోమవారం జారీ చేసినట్లు పేర్కొన్నారు.

చివరిగా ఏపీ వైద్య మండలి ఎన్నికలు 2006 లో జరిగాయన్నారు. అర్హత కలిగిన వైద్యులు ఎక్కడ నుంచైనా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉందని, ఇందుకు మొబైల్ ఫోన్ సైతం ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు.

*ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం:*

మండలిలో సభ్యత్వం కలిగిన 55,504 మందిలో ఎవరైతే రాష్ట్రం (లోకల్) లో ఐదేళ్లపైబడి ఉంటున్నారో వారు మాత్రమే ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హత కలిగి ఉంటారన్నారు. ఎన్నికల్లో పోటీచేయదల్చుకున్న వారి నామినేషన్లను మంగళవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు స్వీకరిస్తారన్నారు.

ఈ నెల 28, 29 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చునని, ఫిబ్రవరి 2 వ తేదీన ఎన్నికల్లో పోటీచేసే అర్హత కలిగిన అభ్యర్దుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

ఫిబ్రవరి 9వ తేదీన apmc.ap.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అవ్వడం ద్వారా ఆన్ లైన్ మోడ్ లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. మరసటిరోజు ఫిభ్రవరి 10 వ తేదీన ఉదయం 11 గంటల నుండి ఫలితాలు ప్రకటిస్తారన్నారు..

*లాగిన్ అయ్యే విధానం:*

ఓటింగ్ కోసం అర్హత కలిగిన వైద్యులు ఏపీఎంసీ ఆన్ లైన్ ఎలక్షన్ పోర్టల్ లోకి లాగిన్ కావాలని, ఇందుకు ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంటుందన్నారు. లాగిన్ అనంతరం ఓటరు గరిష్టంగా 30 నిమిషాల వ్యవధిలో ఓటింగ్ ప్రక్రి

య పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు ఎప్పటికప్పుడు ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపిస్తామన్నారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం సభ్యునికి ఓటింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిసేలా మెసేజ్ ఆన్లైన్లో కనిపిస్తుందన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, వైద్య మండలి రిజిస్ట్రార్ ఐ. రమేష్ లు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments