Home South Zone Andhra Pradesh పన్ను బకాయిల చెల్లింపు మీ బాధ్యతగా గుర్తించండి : మున్సిపల్ కమిషనర్

పన్ను బకాయిల చెల్లింపు మీ బాధ్యతగా గుర్తించండి : మున్సిపల్ కమిషనర్

0

కర్నూలు
‘పన్ను చెల్లింపు బాధ్యతగా భావించండి’• నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ• 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులు సీజ్ !!నగరపాలక సంస్థకు పన్ను చెల్లించడం భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ మొండి బకాయిదారులకు సూచించారు.

సోమవారం నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ..

నగరంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, పార్కుల నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి నగరపాలక సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలంటే వంద శాతం బకాయిలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు.

కొందరు పన్నులు చెల్లించకుండా ఇతరులు చెల్లించిన పన్నులతో నగరపాలక సేవలు పొందాలనుకోవడం సమంజసం కాదన్నారు. ప్రతి పౌరుడు పన్ను చెల్లింపును బాధ్యతగా భావించినప్పుడే నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రతిరోజూ కొనసాగిస్తామని, అగ్ర మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఆర్వోలు జునైద్, వాజీద్, స్వర్ణలత, ఆర్‌ఐలు భార్గవ్, తిప్పన్న, శ్రీకాంత్, ఏఆర్‌ఐలు, అడ్మిన్‌లు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version