అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు.
ఎస్సై కెవి రమణ తెలిపిన వివరాల ప్రకారం, ఖచ్చితమైన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 32,700 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని ఎస్సై తెలియజేశారు# కొత్తూరు మురళి.




