Tuesday, January 20, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 93 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 93 ఫిర్యాదులు

కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా…విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 93 ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి.

పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ .కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 93 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1) మా అమ్మ కు  బ్రెయిన్ క్యాన్సర్ పరీక్షల కొరకు తిరుపతికి వెళ్ళి కర్నూలుకి  రైలు లో వస్తుంటే పరిచయం చేసుకుని  ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆదోని, శ్రీనివాస నగర్  శెట్టి గుడి దగ్గర ఉన్న ఉపేంద్ర @ శివ రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేశాడని చర్యలు తీసుకోవాలని కర్నూలు, కల్లూరు మండలం, హేమలత నగర్ కు చెందిన  ప్రవీణ్ కుమార్  ఫిర్యాదు చేశారు.

2)  ఎస్. లింగం దిన్నె దగ్గర ఉన్న మా పొలంలో పొలం పనులు చేసుకునేటప్పుడు అటు వైపు వెళ్ళే చాకలి చిన్న దస్తగిరి  కుమారులు మధు, ఈశ్వరయ్య, మల్లికార్జునలు అసభ్యకర మాటాలతో దుర్భాషలాడుతున్నారని చర్యలు తీసుకోవాలని  కోడుమూరు మండలం, వర్కూరు గ్రామం కు చెందిన చాకలి జయలక్ష్మీ ఫిర్యాదు చేశారు.

3) అనంతపురం కియా షోరూంలో పని చేస్తున్న స్నేహితుడు ద్వారా పరిచయమైన ఒంగోలుకు చెందిన అశోక్  బెంగుళూరు ఐటి సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం ఇప్పిస్తామని  చెప్పి రూ. 4 లక్షల 22 వేలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు మండలం , దూపాడు గ్రామం కు చెందిన సుల్తాన్  ఫిర్యాదు చేశారు.

4) డబ్బులు అవసరమై 9 తులాల బంగారం తాకట్టు పెట్టాము.  తాకట్టు పెట్టిన బంగారం ను తీసుకున్న  మహిళా  ఉద్యోగిని తిరిగి ఇవ్వకుండా మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని చర్యలు తీసుకోవాలని కర్నూలుకు  చెందిన  అరుణ ఫిర్యాదు చేశారు.

5) ఇంటర్ చదివేటప్పుడు  ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్నాము. కొద్ది రోజుల తర్వాత నా భర్త  తొగట శివ నాగేంద్ర నన్ను మోసం చేసి వెళ్ళి పోయాడని నా భర్త పై చర్యలు తీసుకోవాలని కర్నూలు కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.

6)    సోషల్ వేల్పేర్ స్కూల్ లో  బ్యూటిషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అనంతపురం కు చెందిన మహేష్, రమేష్ లు రూ. 2 లక్షలు తీసుకొని మోసం చేశారని  కర్నూలుకు చెందిన తేజేశ్వని   ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సిఐలు శివశంకర్, రామకృష్ణ, విజయలక్ష్మీ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments