మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ₹. 60.000 విలువైన చెక్కును లబ్ధిదారుడు రాజుకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అందాల్సిన ఫలాలు సకాలంలో చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఆపదలో ఉన్న కుటుంబానికి తో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు
. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా త్వరితగతిన సహాయం అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, సాజిత్, తదితరులు పాల్గొన్నారు.




