ధర్మాగ్నిలో ఉదయించిన సూర్యుడు… భరతఖండపు రక్షకుడు “పుష్యమిత్ర శుంగుడు”!
చరిత్ర పుటల్లో కొన్ని పేర్లు కనుమరుగైపోవచ్చు..
కానీ ఆ పేర్లు లేకపోతే అసలు “చరిత్రే” మిగిలి ఉండేది కాదు..
అటువంటి ఒకే ఒక్క పేరు.. ‘ పుష్యమిత్ర శుంగుడు ‘..
భారతదేశం అస్తిత్వం ప్రమాదంలో పడిన వేళ..
హిందూ ధర్మం కనుమరుగయ్యే స్థితికి చేరిన వేళ..
ఒక ప్రళయకాల రుద్రుడిలా దూసుకొచ్చిన ఆ వీరుడి కథ ఇది!
బిఫోర్ కామన్ ఎరా 185 అంటే నేటికీ 2211 సంవత్సరాల పూర్వం..
పాటలీపుత్రం..( నేటి పాట్నా )
అది మౌర్యుల సామ్రాజ్యం..
ఒకప్పుడు చంద్రగుప్తుడు ఏలిన గడ్డ..
కానీ ఇప్పుడు? సింహాసనం మీద ఉన్నది బృహద్రథుడు..
శత్రువులు సరిహద్దు దాటి వస్తుంటే..
గ్రీకులు (యవనులు) మన దేశాన్ని ఆక్రమించడానికి కాచుకుని కూర్చుంటే..
రాజు మాత్రం “శాంతి, అహింస” అంటూ మంత్రాలు జపిస్తున్నాడు..
చేతిలో కత్తి పట్టాల్సిన సైన్యాన్ని కూర్చొని పూజలు చేయమంటున్నాడు..
రాజ్యంలో ధైర్యం చచ్చిపోయింది..
ఖజానా ఖాళీ అయ్యింది..
బౌద్ధ సన్యాసుల ప్రభావంతో పాలన పడకేసింది..
భరతజాతిని రక్షించే నాధుడే లేడా అని మాతృభూమి రోదిస్తున్న సమయమది..
సైనిక కవాతు జరుగుతోంది.. గ్రీకు రాయబారులు వెటకారంగా నవ్వుతున్నారు..
రాజు బృహద్రథుడు సైన్యాన్ని చూసి.. “సైనికులు అలసిపోయారు, యుద్ధం వద్దు..ప్రార్థనలు చేద్దాం” అన్నాడు..
పక్కనే ఉన్న సేనాని పుష్యమిత్ర శుంగుడి రక్తం మరిగిపోయింది..
పుట్టుకతో బ్రాహ్మణ..క్షాత్రంలో క్షత్రియుడు..
ఆయనలోని క్షాత్రo ఓటమిని అంగీకరిచే పరిస్తితిలో లేదు..
“మహారాజా! సైన్యం అలసిపోలేదు..
విజయం రుచి చూడక విసిగిపోయింది!” అని గర్జించాడు.
క్షణం ఆలస్యం చేయలేదు..
పుష్యమిత్ర ముందుకు అడుగు వేశాడు. చక్రవర్తి ముందు నమస్కరించి..
ఖడ్గం బయటకు లాగాడు.
ఒకే ఒక్క వేటు..ఒక మూలుగు..
ఒక అయోగ్య వంశం ముగిసింది..
మూడు శతాబ్దాల మౌర్య సామ్రాజ్యానికి సూర్యాస్తమయం అయింది..
చంద్రగుప్త మౌర్యుని ధ్వజాలు ఎగురుతున్న ఆ పరేడ్ మైదానంలో రక్తం కారింది..
సైనికులు స్తబ్దులయ్యారు..
తర్వాత నెమ్మదిగా తిరిగారు – చంపబడిన చక్రవర్తి వైపు కాదు..
నిటారుగా నిలబడి ఖడ్గం పట్టుకున్న సేనాపతి వైపు..
తిరుగుబాటు రాలేదు. వ్యతిరేకత రాలేదు. నిశ్శబ్దం భయంకరంగా వ్యాపించింది.
వెనుక వరుసల నుంచి ఒక్క పొలికేక వినబడింది – గ్రీకులతో పర్వత మార్గాల్లో పోరాడిన పాత సైనికుల నుంచి: “జయ శుంగ!”
వాళ్లు మానసికంగా అప్పటికే శుంగ ను రాజుగా ఎంచుకున్నారు..
పుష్యమిత్ర శుంగ – ఒక సాధారణ సేనాపతి కాదు..
అతను మాతృభూమి రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహావీరుడు..
ఒక అయోగ్య చక్రవర్తిని చంపడం ద్వారా…
ఒక కుళ్ళిన వంశాన్ని అంతం చేయడం ద్వారా…
భరతవర్షాన్ని యవనుల దాడుల నుంచి..
ఆధ్యాత్మిక క్షీణత నుంచి రక్షించాడు.
వారికి కావాల్సింది ప్రార్ధనలు చేసే రాజు కాదు..
దేశాన్ని రక్షించే మొనగాడు!
యవనుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు: పుష్యమిత్రుడు అధికారం కోసం ఆశపడలేదు..
రాజ్యాన్ని కాపాడటం కోసం “అశ్వమేధ యాగాన్ని” నిర్వహించాడు. గ్రీకు దురాక్రమణదారుడు “మినాండర్” గంగా మైదానాల్లోకి చొరబడితే..
తన మనవడు వసుమిత్రుడిని పంపి గ్రీకులను తరిమికొట్టాడు..
సింధు నది ఒడ్డున యవనుల గర్వాన్ని అణిచివేసి..
“ఈ దేశానికి మళ్ళీ ఒక రక్షకుడు దొరికాడు” అని చాటిచెప్పాడు..
ఆయన చరిత్ర మరిచిన త్యాగధనుడు: అతడు బౌద్ధాన్ని ద్వేషించలేదు, కానీ దేశాన్ని నిర్వీర్యం చేసే విధానాలను సహించలేదు..
అందుకే సాంచి స్తూపం తోరణాలు అతడి కాలంలోనే వెలిశాయి..ఇప్పుడది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం.
వైదిక ధర్మాన్ని, యజ్ఞయాగాదులను పునరుద్ధరించి..మరణశయ్య మీదున్న హిందూ ధర్మానికి మళ్ళీ ప్రాణం పోశాడు..
అతడు అశోకుడు కాదు..
చంద్రగుప్తుడు కాదు..
అతడు పుష్యమిత్రుడు! చేతికి రక్తపు మరకలు అంటుకున్నా సరే..
ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి సాహసించిన ఒక సేనాని.
ఈరోజు మనం “భారతీయులుగా”, “హిందువులుగా” తలెత్తుకుని తిరుగుతున్నామంటే.. ఆనాడు ఆ వీరుడు చేసిన త్యాగమే కారణం. ఆ మహాయోధుడికి మనసారా నివాళులు అర్పిద్దాం..నేడు వారి పుణ్యతిధి..
భారత్ మాతాకీ జై
జై హింద్!
Narendra Modi
#PushyamitraShunga #AncientIndia #HinduResurgence #HistoryOfBharat #WarriorGenaral #VedicRevival #IndianHistory #UnsungHero #BharatMataKiJai #DharmaPath






