పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారిని చందన ప్రియ తెలిపిన వివరాల ప్రకారం.
ఈ కార్యక్రమంలో 156 పశువులకు పిడుదుల మందు పిచికారి, నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. అలాగే, 80 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ, 17 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. పాల దిగుబడి, పశుసంపద అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




