ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి
23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ
రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన వైనం
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది.
ఇదివరకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 22వ తేదీన విచారణకు రావాలని కోరిన ఈడీ, ఆ మరుసటి రోజే మిథున్ రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.




