Home South Zone Andhra Pradesh అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు

అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు

0
0

అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పార్శిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు… గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా అనంతపురం త్రీటౌన్ సి.ఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతపురం త్రీటౌన్ పరిధిలోని వివిధ పార్శిల్ సర్వీస్ కార్యాలయాలు మరియు ఆర్టీసీ బస్టాండులలో స్నిఫర్ డాగ్ సహకారంతో విస్తృత తనిఖీలు కొనసాగాయి.

పార్శిళ్ల ద్వారా గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టి ప్రజల భద్రతను కాపాడడమేనని పోలీసులు తెలిపారు.

ప్రజల భద్రత మరియు గంజాయి కట్టడి దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే ప్రజలు ఎవరైనా మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS