పెనమలూరు నియోజవర్గం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా తానే రక్తదానం చేసి ప్రారంభించారు తరాలు మారిన యుగాలు మారిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నాడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా పోరంకి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాను రక్తదానం చేసి శిబిరాన్ని లాంఛినంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు అనుములు ప్రభాకర్ రావు కంకిపాడు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ అన్ని ధన రామకోటేశ్వరరావు ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో
మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో స్థాయిగా నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు అని అలాంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా గత 20 సంవత్సరాలుగా పెనమలూరులో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఎన్టీఆర్ వర్ధంతి జయంతి ల సందర్భంగా పెనమలూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని భవిష్యత్తులో కూడా ఆ మహనీయుని వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.




