Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు |

బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు |

కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా…ఇద్దరు నిందితులు అరెస్టు.దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం. గత నెల రోజులుగా కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్,  ఉద్యోగ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ,  ఎన్టీఆర్ బిల్డింగ్స్ తదితర ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉంచినటువంటి ఆటోలు,  ట్రాక్టర్లు,  జెసిబిలు,  బోర్ వెల్ వాహనాలు కు అమర్చి నటువంటి బ్యాటరీలను దొంగతనం చేసుకువెళ్లారు .అనేటువంటి ఫిర్యాదుల పైన నాలుగు పట్టణం పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయి.

ఈ మూడు కేసులు లో దర్యాప్తులో భాగంగా లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత SI గోపినాథ్, SI శరత్ కుమార్, క్రైమ్ పార్టీ మురళి, సుబ్బరాయుడు,  జీనస్ ల సహాయంతో కర్నూల్ పట్టణం చెంచు నగర్ కు చెందినటువంటి సుధాకర్ మరియు మహేంద్రలు బ్యాటరీలు దొంగిలించినట్టుగా తెలియ వచ్చింది. ఆ ఇద్దరి యొక్క కదలికలపై నిఘా ఈ రోజున వారిని గుత్తి పెట్రోల్ బంకు వద్ద  అరెస్టు చేసే విచారించగా వారు సుమారు 11 బ్యాటరీలను దొంగలిచ్చినట్టుగా .

ఒప్పుకుంటూ సదరు బ్యాటరీలను అమ్ముకొనడానికి వారి ఇంటి వెనకాల ఉన్నటువంటి షెడ్ లో దాచి ఉంచామని చెప్పగా వాటిని వారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది.  దొంగలించబడిన బ్యాటరీల విలువ సుమారు  లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది. వారి నుండి రికవరీ చేసిన  బ్యాటరీలను  సంబంధిత ఫిర్యాదుదారులకు అందజేయడం జరుగుతుంది . వీరిద్దరిని రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది.

..ఈ సందర్భంగా కర్నూల్ నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ గారు మాట్లాడుతూ….కర్నూలు నగరంలో గతకొన్ని రోజులుగా బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశామన్నారు. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇన్వర్టర్స్ ల బ్యాటరీలు పోవడంతో భాదితులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కర్నూల్ నాలుగో పట్ఞణ పోలీసులు ధర్యాఫ్తు చేయగా కర్నూలు కు చెందిన సుదాకర్(19)  మహేంద్ర(19)     దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి  11 బ్యాటరీలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments