Home South Zone Telangana అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|

అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ అవాజ్ ప్రతినిధి) తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న ప్రమాదాల మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం చట్టాలను అమలు చేయడమే కాకుండా  ప్రజల్లో అంతర్గత మార్పు తీసుకునే వాళ్ళనే సదుద్దేశంతో అల్వాల్ పోలీసులు చేపట్టిన “అరైవ్ అలైవ్”  (Arrive Alive) కార్యక్రమం కొత్తవడిని సృష్టిస్తుంది. జాతీయ రోడ్డు భద్రత మాసరోత్సవాల్లో భాగంగా హకీంపేట బస్ డిపోలో జరిగిన ఈ అవగాహన సదస్సుపై భారత్ అవాజ్ గ్రౌండ్ రిపోర్ట్.

లక్ష్యం:ప్రతి ప్రయాణం ఒక సురక్షిత ప్రయాణం కావాలి.
ప్రభుత్వం యొక్క ప్రధాన “లక్ష్యం ప్రమాదాలలో నివారించి సురక్షంగా గమ్యానికి చేరుకోవాలనే” సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాళ్లడం.
ఈసారి రద్దీగా ఉండే హకీంపేట బస్ డిపోను ఎంచుకొని వందలాదిమంది ప్రయాణికులు, మరియు ఆర్టీసీ డ్రైవర్లను నేరుగా కలిశారు.

ఈ సందర్భంగా అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ అనేది ఒక నైపుణ్యం మాత్రమే కాదు, అది అనేకమంది ప్రాణాలతో ముడిపడిన అత్యంత బాధ్యత. ఒక చిన్న తప్పిదం వారిని రోడ్డున పడేస్తుంది. అని భావోద్వేగంగా మాట్లాడారు.
ప్రజాభిప్రాయం : ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘ డ్యూటీ వేళలు, రోడ్లపై అస్తవ్యస్తమైన పరిస్థితులు, తమను ఒత్తిడికి గురి చేస్తున్నాయని పోలీసుల దృష్టికి తెచ్చారు. పోలీసులు వారి సమస్యలను సావధానంగా విని, ఉన్నతాధికారులకు మీ సమస్యలను చేరవేరుస్తామని వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఒక తూతూమంత్రపు సదస్సులా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. చట్టాన్ని అమలు చేసే పోలీసులు తమ పౌర బాధ్యతగా ప్రజలతో మమేకమైతే సామాజిక మార్పు సాధ్యమని ఈ సంఘటన సూచించింది.

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్సై దేవేందర్, ట్రాఫిక్,  పోలీస్ సిబ్బంది, మరియు డిపో మేనేజర్ పాల్గొన్నారు.
భారత్ ఆవాజ్ ఇలాంటి సామాజిక హిత కార్యక్రమాలను  మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version