హైదరాబాద్ అభివృద్ధి పథంలో మరో కీలక అడుగు పడింది. కొత్వాల్‌గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుద్వేల్ లేఅవుట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎకో హిల్ పార్క్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని విస్తరిస్తున్నామని, బుద్వేల్ ఐటీ హబ్‌కు ఈ ఇంటర్‌ఛేంజ్ గుండెకాయ వంటిదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఎకో హిల్ పార్క్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.
ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా, దక్షిణ హైదరాబాద్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ మౌలిక సదుపాయాలు దోహదపడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
