Home South Zone Andhra Pradesh టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమికి కారణమిదేనా? |

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమికి కారణమిదేనా? |

0
0

Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. ఈ ఓటమికి రోహిత్, జడేజా వంటి ఆటగాళ్ళు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ, మరో ఆటగాడి హాస్తం కూడా ఉంది.

Team India T20I World Cup 2026 Squad: భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించినప్పుడు, వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాకు ఎలాంటి సవాలు ఎదురుకాదని, కివీస్ క్లీన్ స్వీప్ సాధిస్తుందని అందరూ భావించారు. అయితే, భారతదేశంలో తొలిసారిగా వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా న్యూజిలాండ్ అందరికి ఊహించని షాక్ ఇచ్చింది. టీమిండియా ఓటమిలో కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన కీలకంగా మారింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలను అందరూ లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, భారత జట్టుకు అతిపెద్ద నష్టం స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైఫల్యం. దీంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026లోనూ ఈ ప్లేయర్ వల్ల భారత జట్టుకు ఇబ్బంది కలగవచ్చు.

తొలి మ్యాచ్‌లో విజయంతో భారత జట్టు సిరీస్‌ను ప్రారంభించింది. కానీ, తరువాతి రెండు మ్యాచ్‌ల్లో కివీస్ భారత జట్టును ఓడించింది. రెండు మ్యాచ్‌లలో భారత బ్యాటింగ్ విమర్శలకు గురైనప్పటికీ, బౌలింగ్ కూడా దారుణంగా ఉంది. రెండో వన్డేలో, న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 285 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు.

#Sivanagendra

NO COMMENTS