బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల కలెక్టరేట్లో అర్జీదారుల నుండి వినతుల స్వీకరణ, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్, జేసీ ఆదేశం
బాపట్ల జిల్లా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపడమే అధికారుల
బాధ్యతని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని హాల్ నందు నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు.
బాపట్ల ఏరియా వైద్యశాలలో క్యాంటీన్ లేక పోవడంతో రాత్రుల సమయంలో రోగులు అల్పాహారం, పాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని క్యాంటీన్ ఏర్పాటు చేసి రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వివరిస్తున్న బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు.
#Narendra




