మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవోలు,
డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీల్లో సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని, తాగునీటి బోర్లు, కాలువలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.




