తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు – శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం…. తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ…
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పట్ల నిర్వహణ పట్ల ఎంత కఠినంగా ఉన్నారో ఇటీవల జిల్లా ప్రజలు చూస్తున్నారు. ఇందులో భాగంగానే విధి నిర్వహణలో అలసత్వం వహించిన తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, మరియు , ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసి తప్పు చేస్తే సొంత డిపార్ట్మెంట్ పై తను కఠినంగా ఉంటానన్న హెచ్చరికలు పంపారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లా ప్రజల్లో పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని జోరుగా చర్చ నడుస్తుంది.
