విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు
విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా.
కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రాప్తాడు బస్టాండ్ నందు మరియు కూడేరు ఏఈఈ విద్యుత్ కార్యాలయం ఎదుట, అలాగే గార్లదిన్నె ఏఈఈ విజయ్ కుమార్ గారు MRO కార్యాలయం దగ్గర విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోర్డింగుల ఆయా ప్రదేశాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండటం వల్ల ప్రయాణీకులు, వినియోగదారులతో పాటు సామాన్య ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగి, విద్యుత్ ప్రమాదాల నివారణకు దోహదపడనుంది.
