అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్. కార్యాలయంలో సోమవారం ప్రత్యేక రెవిన్యూ క్లినిక్‌ను ప్రారంభించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రీ సర్వే, ఎఫ్ లైన్, ఆన్‌లైన్, అండగల్, మ్యుటేషన్, 1బి, అసైన్మెంట్, డీకేటీ భూములు వంటి రెవిన్యూ సమస్యలకు ఒక్కో కౌంటర్ ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




