ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సోమవారం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం గోడపత్రికను ఆవిష్కరించిన ఆమె.
ఈ శిబిరాల్లో పశువులు, దూడలు, సన్న జీవాలకు నట్టల నివారణ మందులు, గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు అందిస్తామని పేర్కొన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.




