బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
తమ సమస్యలను విన్నవించుకున్న 36 మంది అర్జీదారులు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వరకట్న వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు తదితర పలు సమస్యలతో మొత్తం 36 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ గారు అర్జీదారుల సమస్యలను కూలంకషంగా విని, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra




