మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు పాల్గొన్నారు. ఆయన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి
వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 230 అర్జీలను స్వీకరించారు. అర్జీలను ఆలస్యం లేకుండా, నాణ్యతతో పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా ఆడిట్ నిర్వహించి, అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.
