అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు.
భూ వివాదాలు, ఆన్లైన్ మోసాలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై విచారణ చేపట్టారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.




