చీరాల: పేరాల లో వైభవంగా శ్రీ బద్రావతి సమేత భావనరుషి స్వామి రథోత్సవం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్ర నాథ్ గారు
పేరాల శ్రీ బద్రావతి సమేత భావన రుషి స్వామి వారి రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కనులవిందుగా జరిగిన ఈ రథోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య ఆయన రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు.
భక్తిశ్రద్ధలతో సాగిన ఈ రథోత్సవం చీరాల పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక శోభను నింపిందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
#Narendra




