అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ, యోగి వేమన మన రాష్ట్రంలో పుట్టడం, ఆయన రాసిన తెలుగు పద్యాలు మనకు దక్కడం తెలుగు ప్రజల భాగ్యమని అన్నారు.
సోమవారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యోగివేమన పద్యాలు 500 ఏళ్లైనా ఇప్పటికీ ప్రజల నిత్యజీవితంలో వినియోగంలో ఉన్నాయని ఆయన తెలిపారు.




