అన్నమయ్య జిల్లాలో మారుమూల, సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడానికి అత్యాధునిక RACE వాహనాలను
జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా కమ్యూనికేషన్ విభాగానికి ఒక 4-వీలర్, ఒక 2-వీలర్ RACE వాహనాలు కేటాయించారు. నాయకుల పాదయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫానుల సమయంలో ఇవి కమ్యూనికేషన్ హబ్‌లుగా పనిచేస్తాయని ఎస్పీ తెలిపారు.




