Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneTelanganaగాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|

గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|

హైదరాబాద్ : (భారత్ ఆవాస్ ప్రతినిధి)  ఆసిఫాబాద్ కు చెందిన పల్లవి ఆరోగ్య సమస్యలతో స్థానిక ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుండి పలు ప్రవేటు ఆసుపత్రులలో చికిత్స కొరకు తిరిగారు.గుండె పరీక్ష చేసి వరంగల్ ఎంజీఎం కు వెళ్లమని సూచించారు. అక్కడి నుండి గాంధీ ఆసుపత్రి లో చేర్పించారు.

వివరాల్లోకి వెళితే…  గాంధీ ఆసుపత్రి లో పల్లవి అనే 25 సంవత్సరాల మహిళా రోగి గత 10 రోజుల నుండి అనారోగ్యంతో శ్వాస ఆడకపోవడం మరియు గుండె దడ అనే సమస్యలతో వచ్చారు. రోగికి బార్డెట్ బీల్ సిండ్రోమ్, పాలిడాక్టిలీ, రెడ్ కోన్ డిస్ట్రోఫీ (రెటినిటిస్ పిగ్మెంటోసా), సెంట్రల్ ఊబకాయం, మేధో వైకల్యం, టైప్ I డయాబెటిస్ ఉన్నాయి.

BBS1, BBS2, BBS4 మరియు ఇతరులతో సహా వివిధ జన్యువులలోని జన్యు ఉత్పరివర్తనాల వల్ల బార్డెట్-బీల్ సిండ్రోమ్ సంభవించవచ్చునని అన్నారు.
రోగిని పరీక్షించి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఓస్టియం ప్రైమమ్ ASD 14.7 మి.మీ. తీవ్రమైన MR తో ఉన్నట్లు నిర్ధారించారు.

*EF-65% ఉందని అంచనా వేశారు. అటోసోమల్ రిసెసివ్, 24 జన్యువులు గుర్తించబడ్డాయి (ఉదా: BBS1, BBS10, BBS12).సిండ్రోమ్ అనేది అరుదైన జన్యుపరమైన రుగ్మత, ఇది బహుళ అవయవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఇది వంటి లక్షణాలకు దారితీస్తుందని,ఊబకాయం, దృష్టి సమస్యలు, మూత్రపిండాల అసాధారణతలు మరియు అభిజ్ఞా బలహీనత లాంటివి రావచ్చునని ,ఓస్టియం ప్రైమమ్ ASD – 2.5 సెం.మీ x 2 సెం.మీ పరిమాణంలో, పూర్వ మైట్రల్ లీఫ్లెట్‌పై కొంత క్లెఫ్ట్ ఉందని తెలిపారు. పెరికార్డియంతో అనూలోప్లాస్టీ + ఓస్టియం ప్రైమస్ ASD క్లోజర్‌తో మిట్రల్ వాల్యూ AML రిపేర్ చేయడం జరిగిందని గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ రవీంద్ర తెలిపారు.

ఎంతో సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేసిన వైద్యుల బృందం డాక్టర్ రవీంద్ర, డాక్టర్ త్రిభువన్, డాక్టర్ హర్షిత డాక్టర్ రాజశేఖర్ లను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అభినందించారు.
వీరితో పాటు ఆర్ యం ఓ లు డాక్టర్ RMO 1 శేషాద్రి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ నవీన్, డాక్టర్ హసిత , మత్తు నిపుణులు డాక్టర్ మురళి , డాక్టర్ కిరణ్, డాక్టర్ శ్రేయ, డాక్టర్ సుచరిత, డాక్టర్ సాయి ప్రసన్న కార్డియాలజీ విభాగం డాక్టర్ రవి శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.
#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments