Home South Zone Andhra Pradesh దావోస్‌లో చంద్రబాబు: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అగ్రస్థానం |

దావోస్‌లో చంద్రబాబు: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అగ్రస్థానం |

0
1

Chandrababu Naidu Andhra Pradesh is the Best Investment Destination
దావోస్ లో చంద్రబాబు టీమ్ బిజీ బిజీ
ఒక్కసారి ఏపీకి వచ్చి చూడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు
కూటమి ప్రభుత్వ వ్యాపార వేగం కళ్లారా చూడాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాము పాటిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళవారం సీఐఐ నిర్వహించిన “ఇండియా ఎట్ ది సెంటర్: ది జాగ్రఫీ ఆఫ్ గ్రోత్ – ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్” అనే సెషన్‌లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడుల గమ్యస్థానం మాత్రమే కాదని, అది ఒక వ్యూహాత్మక ప్రయోజనం (స్ట్రాటజిక్ అడ్వాంటేజ్) అని పారిశ్రామిక దిగ్గజాలకు చెప్పినట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. “భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) దాదాపు నాలుగో వంతు వాటాతో, మా వ్యాపార నిర్వహణ వేగం ఏపీని ఒక ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టింది. దీర్ఘకాలిక వృద్ధి కోసం మాతో భాగస్వాములు కావాలని ప్రపంచ పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాను” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

NO COMMENTS