Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshభక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్ దినోత్సవం |

భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్ దినోత్సవం |

భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి

పశ్చిమలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి దేవాలయాలను మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సందర్భంగా మాజి మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఆత్మార్పణం చేసుకున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని దేవాలయాల్లో హోమాలు, అభిషేకాలు మరియు మహిళలచే కుంకుమ పూజలు విశేషంగా జరుగుతున్నాయన్నారు. అయితే, ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజకీయం చేయడం అత్యంత విచారకమన్నారు. కూటమి ప్రభుత్వం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారని కానీ ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఈసారి ఆ ఆనవాయితీని విస్మరించి వేరే వ్యక్తులకు ఆ బాధ్యతను అప్పగించడం వాసవి మాత పట్ల వారికి ఉన్న భక్తి, గౌరవం అర్థమవుతుందన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి గారు ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని ఇక్కడ ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. వ్యాపారాలు లేవని వ్యాపారస్తుల పైన జీఎస్టీ పేరుతొ అధికారులతో దాడులు చేయిస్తున్నారని, పొదిలిలో అవినాష్ అనే యువకుడిని నిర్మానుష్యంగా పోలీసులు కొట్టినా పోలీసుల పై చర్యలు లేవని, పిడుగురాళ్ళలో జ్యోతి అనే మహిళను అర్ధరాత్రి వరకు అక్రమంగా స్టేషన్‌లో నిర్బంధించినా సంబంధిత అధికారులపై ఎటువంటి చర్యలు లేవని, దర్శిలో రేషన్ డీలర్ ఆంజనేయులు ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగ బాధితుడు బయపడి దేవాలయంలో తలదాచుకుంటే అతని పైన కేసులు పెట్టారని, చీరాలలో కాల్ మని అధిక వడ్డీ వ్యాపారుల వేధింపుల తాళలేక సుజాత గారు మరియు ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు ఆర్యవైశ్యుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని కాల్ మని వారి పై ఎటువంటి కేసులు చర్యలు లేవన్నారు. నంద్యాలలో జనసేన కు సంబంధించిన ఆర్యవైశ్య నాయకుడైన వాసు స్థలాన్ని తెలుగుదేశం నాయకుడు కబ్జా చేసారని దాని పైన ఎటువంటి పురోగతి లేదన్నారు, అనంతపురంలో ఆర్యవైశ్యుల ఆస్తులను ఆక్రమించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఆర్యవైస్యులకు రాష్ట్రంలో ఎక్కడ కూడా భద్రత లేదన్నారు. వాసవి అమ్మవారి ఆదేశానుసారం ఆర్యవైస్యులందరు సేవ భావంతో ఉంటారని అంటువంటి వారికీ కూటమి ప్రభుత్వంలో రక్షణ కరువైందన్నారు. మరోవైపు, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించామని ఆర్యవైశ్యుల నుంచి అంగుళానికి 5 వేల రూపాయల చొప్పున భారీ వసూళ్లకు పాల్పడటం దారుణమన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం, రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కోసం నిధులు కేటాయించలేదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సేవా భావంతో ఉండే ఆర్యవైశ్యులపై జిఎస్‌టి తనిఖీల పేరుతో దాడులు చేస్తూ, వారి వ్యాపారాలను దెబ్బతీస్తూ విగ్రహం ఏర్పాటు పేరుతొ ఆర్యవైస్యుల దగ్గర డబ్బులు దండుకోవడం విడ్డూరం బాధాకరమని అన్నారు. అందుకే, ఈ కూటమి ప్రభుత్వ బాధల నుండి ఆర్యవైస్యులను రక్షించమని వాసవి మాతను వేడుకుంటున్నామని తెలియజేసారు

స్థానిక బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం (కొత్తగుళ్ళు) నందు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని వాసవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు

స్థానిక శేషయ్య వీధిలోని శ్రీ కృష్ణ ప్రార్ధన మందిరం నందు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని వాసవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు

స్థానిక భవానీపురం శివాలయం సెంటర్ భవాని టవర్స్ నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సేవ సమితి వారి ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని వాసవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు

స్థానిక భవానీపురం హోసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ కోదండ రామాలయం నందు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని వాసవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు

స్థానిక బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రం నందు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారి అన్నప్రసాదాన్ని వడ్డించారు

స్థానిక లంబాడీపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం నందు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని వాసవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments