బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు. శాంతి, అహింసలకు ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారు చూపిన మార్గం పోలీస్ శాఖకు ఆదర్శనియం శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు శాంతి, అహింసలకు ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పేర్కొన్నారు. మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ గారు అమ్మవారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ వృత్తాంతం భారతీయ సంస్కృతిలో ఒక అద్వితీయ ఘట్టమని, అది సమాజానికి శాంతి మరియు అహింసల మార్గాన్ని బోధిస్తుందని తెలిపారు. లోక కళ్యాణం కోసం, స్త్రీజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అమ్మవారు చేసిన త్యాగం నేటి కాలానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆయుధాల ద్వారా వచ్చే విజయం కంటే, ఆత్మబలంతో సాధించే అహింసా మార్గమే శ్రేష్ఠమని అమ్మవారు ఆనాడే నిరూపించారని కొనియాడారు.
విష్ణువర్ధనుడి బలప్రయోగాన్ని ఎదిరించడంలో అమ్మవారు చూపిన ధైర్యం, యుద్ధం వల్ల జరిగే రక్తపాతాన్ని నివారించేందుకు ఆమె ఎంచుకున్న ఆత్మార్పణ మార్గం సామాజిక శాంతి పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతుందని తెలిపారు. నేటి సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరరహిత సమాజ స్థాపనకు అమ్మవారి బోధనలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ చారిత్రక ఘటనను విశ్లేషిస్తే, మహిళా భద్రత మరియు సామాజిక బాధ్యత వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖ పరంగా ప్రజల రక్షణకు, నేరాలను నివారించేందుకు అమ్మవారు చూపిన తెగువ ఆదర్శనీయమన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు సమాజం పట్ల సేవాభావంతో వ్యవహరిస్తూ, ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ, ధర్మబద్ధంగా జీవించడం ద్వారానే నిజమైన ప్రశాంతత లభిస్తుందని, బ్రహ్మకుండం వంటి పవిత్ర క్షేత్రాలు సమాజానికి నైతిక విలువలను అందించే స్ఫూర్తి కేంద్రాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఓ బి. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారధి, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దిన్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ కె. భుజంగరావు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra






