శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న -MLA బొండా ఉమామహేశ్వరరావు గారు*
ధి: 20-01-2026 మంగళవారం ఉదయం 10:00 గంటలకుసెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం, జీఎస్ రాజు రోడ్ లో ఉన్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నిర్వహించిన “శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవము” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి, 108 కలశములతో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు, 108 సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకము ఘనంగా నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు..
ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ :-పెనుగొండలో వాసవీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు, అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు విశేషంగా హాజరయ్యారని…
అలాగే ప్రభుత్వం అధికారికంగా వాసవీ అమ్మవారికి బట్టలు సమర్పించి, హిందూ సంస్కృతి–సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని…
ఇతర మతాలను గౌరవిస్తూనే, రాష్ట్ర సుభిక్షం, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరి సహకారం, ఆశీస్సులు అత్యంత అవసరమని..
అదేవిధంగా పెనుగొండను వాసవీ అమ్మవారి పవిత్ర క్షేత్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు జిల్లా పేరును మరింత ఘనంగా నిలిపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, తెలుగు జాతికి వెలుగు నిచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత అని అన్నారు. ఆయన స్మారకార్థంగా విగ్రహ స్థాపన ద్వారా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు..
వాసవీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు…
ఈ కార్యక్రమంలో:- కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు తుమ్మలపెంట శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు పెనుకొండ సుబ్బారావు, వంకదార వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ, కోశాధికారి దేవకి శివ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
