Home South Zone Andhra Pradesh ఎమ్మెల్యేకు ఎంపీటీసీ సాంబశివరావు కృతజ్ఞతలు.

ఎమ్మెల్యేకు ఎంపీటీసీ సాంబశివరావు కృతజ్ఞతలు.

0

నల్లమోతువారిపాలెం గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం గ్రామస్తుల్లో కొత్త ఆశలు నింపిందని తెలిపారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు.

ముఖ్యంగా స్మశాన వాటిక అభివృద్ధి, సిమెంట్ రోడ్ల నిర్మాణం గ్రామ దీర్ఘకాలిక అవసరాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డితో పాటు రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు మరియు కూటమి పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తామని సాంబశివరావు భరోసా ఇచ్చారు.

NO COMMENTS

Exit mobile version