గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గం 56వ డివిజన్ మోతిలాల్ నగర్ నందు రూ.31 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గారు స్పందిస్తూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గడపలోనూ సంతోషాలు కనిపిస్తున్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లతో ప్రజలకు అందిస్తూ స్వర్ణాంధ్ర సాధన కోసం కృషి చేస్తున్నామని, ప్రజలు సంక్రాంతి సంబరాలను ఎంత సంతోషంగా చేసుకున్నారో చూస్తేనే అర్థమవుతుందని, గత ప్రభుత్వంలో గొప్పగొప్ప కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిన దుర్మార్గపు పాలన జగన్ ప్రభుత్వానిదైతే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక ప్రగతికి బాటలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గారికే దక్కుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను అని తెలిపిన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిల గారు #ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_తెలుగు_మహిళ_సెక్రటరీ_గుడిపల్లి_వాణి
మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.




