చీరాల: చీరాల పట్టణంలోని దండుబాటు ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని అన్నారు. ఈ సందర్భంగా చెత్త ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని దళిత బహుజన పార్టీ నాయకుడు డిమాండ్ చేశారు.
సందర్భంగా జిలాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటే మరోపక్క అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం విడ్డురంగా ఉందన్నారు.
స్వర్ణ గేట్, వైకుంఠపురం, నగర్ పాలేటి నగర్,జవహర్ నగర్, హరి ప్రసాద్ నగర్ ప్రాంతాలను అనుకుని ఉన్న దండుపాటి రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి బోండాలు చెత్తాచెదారాలు ఉండడంతో స్థానిక నివాస ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా దండుబాటులోని మురుగునీటి డ్రైన్ పై మూతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాష, ఖాదర్, అబ్దుల్, బుడే, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
#Narendra




