Home South Zone Andhra Pradesh నూతన ఆర్.జి.ఐ కమిషనర్ల ప్రమాణ స్వీకారం |

నూతన ఆర్.జి.ఐ కమిషనర్ల ప్రమాణ స్వీకారం |

0
2

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్.*

అమరావతి,20 జనవరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం(Oath) చేయించారు.

ఈమేరకు మంగళవారం ఎపి సచివాలయంలో సిఎస్ కమీషనర్లతో ప్రమాణం చేయించారు.

రాష్ట్ర సమాచార కమీషన్ చీఫ్ కమీషనర్ గా వజ్జా శ్రీనివాసరావు తో ముందుగా ప్రమాణం చేయించారు.

తదుపరి పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు,ఆదెన్న గాజుల,చరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిచే ఆర్టీఐ కమీషనర్లుగా ప్రమాణం చేయించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్టీఐ అధికారులు,నూతన ఆర్టీఐ కమీషనర్ల కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS