పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన కూడళ్లు అన్నీ కూడా జనాలు లేక బోసిపోయాయి.
కొంతమంది ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. ప్రస్తుతం 20 డిగ్రీలు చలి ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా సంక్రాంతి పండుగ అయిపోయిన అనంతరం చలి తగ్గుతుంది.
కానీ ఈ సంవత్సరం రోజురోజుకు చలి తీవ్రత ఎక్కువ కావడంతో వాతావరణం పట్ల చిన్నపిల్లలు, వృద్ధులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు# కొత్తూరుమురళి.




