Home South Zone Andhra Pradesh ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్ |

ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్ |

0
2

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజల వేదనలను ఆలకించే వేదికగా మారిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రేషన్ కార్డుల్లో తప్పులు, ఇంటి పట్టాలు.

పింఛన్లు వంటి అంశాలపై ప్రజల నుంచి అధికంగా అర్జీలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు కనీసం స్థలాలు ఎక్కడో కూడా చూపించలేదని బాధితులు వాపోయారు. ఇంటి పట్టా చేతికిచ్చి ఆర్భాటంగా ప్రచారం చేసుకుని.. స్థలం కూడా చూపించని అసమర్థ ప్రభుత్వాన్ని ఏమని నిందించాలి.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం. ఈ క్రమంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించాం.

NO COMMENTS