కర్నూలు సిటీ :
రైతులకు అండగా కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ నాయకులు..!!బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జనతా వారధి” కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది.
కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతులను స్వీకరించి,ఆయా సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. అలాగే కలెక్టర్ గారితో ఈ సమస్యలపై చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించవలసిందిగా కోరగా.
మూడు రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ,కిసాన్ మోర్చా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు బసవరాజు మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




