15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్.
మంగళగిరి, విజయవాడ, దుగ్గిరాల, కాజా యువకులు, విద్యార్థులే టార్గెట్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా.
షుమారు 4.2 కేజీల గంజాయి స్వాధీనం.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంజాయి కేసు నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు మాట్లాడుతూ.
గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కొరకు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ తనిఖీలు చేపడుతూ, గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాము.దీనిలో బాగంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాల జరగకుండా చూసేందుకు నార్త్ డిఎస్పీ శ్రీ మురళీ కృష్ణ గారి పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ సర్కిల్ సీఐ శ్రీ బ్రహ్మం గారు, మంగళగిరి రూరల్ ఎస్సీ Ch. వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి కేసుల్లోని పాత నేరస్తులు, కొత్తగా గంజాయి సేవిస్తున్న వారి వివరాలు సేకరించి పటిస్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ క్రమంలో ఖాజా టోల్ ప్లాజా సమీపంలోని మధురానగర్‌లోని ఒక వెంచర్లో నిర్మాణాలు జరుగుతున్న అపార్ట్మెంట్లో కొంతమంది గంజాయి కలిగి ఉన్నారని రాబడిన సమాచారం మేరకు రూరల్ సీఐ AV బ్రహ్మం, రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు గారు, గార్ల నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది ఆకస్మిక దాడిచేసి,అక్కడ గుంపుగా ఏర్పడి గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గమనించి వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు వివరాలు:
Cr.No20/2026u/s 8(c) R/W 20 (b) (ii) (B) of N.D.P.S Act – 1985 of Mangalagiri Rural PS.
కేసు విచారణ: కింద తెలిపిన నిందితులలోని A1 to A7, CICL-1(మైనర్ బాలుడు) వారు స్నేహితులు, A1 to A7, CICL-1(మైనర్ బాలుడు) గంజాయి మరియు ఇతర చెడు అలవాట్లకు బానిసలయ్యారు, వారి ఆదాయం వారి చెడు వ్యాసనాలకు సరిపోకపోవడంతో, వారు గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు, రామిదేని.సాయి కృష్ణ (A3) విజయవాడ జైలులో ఉండగా అతనికి అక్కడ ఉన్న సెల్ మేట్, రాయగఢ్ లో రైల్వే తరక్క వద్ద గల సారా కొట్టు వద్ద దొర అనే వ్యక్తి ఉంటాడు అతను ఎంత గంజాయి కావాలంటే అతను ఇస్తాడు అని అతని ఫోన్ నెంబర్
ఇచ్చినట్లు, తరువాత A3 ద్వారా A1to A7, CICL-1 ఒడిశా రాష్ట్రం రాయగడ రైల్వే ట్రాక్ సమీపంలో A16 డోరా అనే వ్యక్తి నుండి కిలోకు రూ.8,000/- చొప్పున గంజాయి కొనుగోలు చేసి, కొంత భాగాన్ని స్వయంగా వినియోగించి, మిగిలిన గంజాయిని 50 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.800/-కు సమీప గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు, ది 20-01-2026 ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో కాజా టోల్ ప్లాజా సమీపంలోని మాధురానగర్ వెంచర్‌లోని.
ఉండవల్లి అపార్ట్మెంట్స్ నిర్మాణాల వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంకి వెళ్ళి, అక్కడ A1 నుండి A7 వరకు మరియు ఒక CICL-1 కలిసి గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తూ, కొంతమేర గంజాయి సేవిస్తూ, విక్రయానికి సిద్ధం చేస్తున్నట్లు గుర్తించి, A1 నుండి A7 వరకు మరియు CICL-1 ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి వద్ద నుండి సుమారు 4.150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, నిందితుల సమాచారం మేరకు, పోలీసులు చినకకాని గ్రామం, హైల్యాండ్ కార్ పార్కింగ్ ప్రాంతంలోని ఓపెన్ ప్లేస్ వద్ద గంజాయి సేవిస్తున్న A9 నుండి A14 వరకు మరియు CICL-2 ను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ కేసులో ప్రధాన సరఫరాదారుడైన A16 డోరా పరారీలో ఉన్నాడు.
అరెస్టు కాబడిన నిందితుల వివరాలు:
1) దాసరి వినయ్ బాబు తండ్రి వెంకటరెడ్డి , వయస్సు 24 సం.లు, యర్రబాలెం గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. (గుళికొండ పోలీస్ స్టేషన్, విశాఖపట్నం మరియు గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్ లో రెండు గంజాయి కేసులు నమోదుకాబడినాయి)
2) కొల్లిమర్ల లోకేష్ తండ్రి రాంబాబు, వయస్సు 20 సం. ,TIDCO houses, నవులూరు గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ (మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రోడ్డు ఆక్సిడెంట్ కేసు.)
3) రామిదేని సాయి కృష్ణ తండ్రి కొండ , వయస్సు 21 సం.లు,అంబటి నగర్, యర్రబాలెం గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా (మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్, గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్ మరియు విజయవాడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లలో మూడు గంజాయి కేసులు ఉన్నాయి)
4) తట్టుకోళ్ల.దానియల్ రాజు @ బడాయి తండ్రి గోపాల్ రావు, వయస్సు 18 సం.లు, పుల్లయ్య నగర్, కాజ గ్రామము,మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా (మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉన్నది)
5) బండిరెడ్డి నందు తండ్రి శ్రీను, వయస్సు 23 సం.లు, మహానాడు, తాడేపల్లి గ్రామం మరియు మండలం, గుంటూరు జిల్లా.(తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మూడు గంజాయి కేసులు, మంగళగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, విజయవాడ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్, భద్రాచలం పోలీస్ స్టేషన్లలో ఒక్కో గంజాయి కేసు ఉన్నది.)
6) చిరుబోయిన హరి కృష్ణ తండ్రి కోటేశ్వర రావు, వయస్సు 19 సం.లు, కాజ గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా (మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉన్నది).
7) నల్లగొర్ల సాయి తేజతండ్రి సత్యనారాయణ , వయస్సు 22 సం.లు,చిన్న పాలెం గ్రామం దుగ్గిరాల మండలం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. (దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు, ఒక హత్యాయత్నం కేసు ఉన్నాయి.)
8) ఒక మైనర్ బాలుడు (ఇతని మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉన్నది)
9) సాధం. పవన్ మాధవ్ @ రామయ్యS/o శ్రీనివాస రావు, వయసు 22 సంవత్సరాలు, చిన్నపాలెం గ్రామం,దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
10) సొంటి విష్ణు వర్ధన్, S/o గోపి, నా వయసు 20 సంవత్సరాలు, పెద్దపాలెం గ్రామం,దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
11) కుందేటి చెన్న కేశవ S/o వెంకటేశ్వర రావు, నా వయసు 19 సంవత్సరాలు ,పెరికల పూడి గ్రామం,దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
12) సాయన అనంత కుమార్ S/o మోహన్ రావు , నా వయసు 32 సంవత్సరాలు, కానూర, విజయవాడ
13) మందా అమాన్ S/o జేసురత్నం, నా వయసు 26 సంవత్సరాలు, BHL, లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రము
14) మలబండి చంద్ర శేఖర్@ చందు S/o రాంబాబు , నా వయసు 25 సంవత్సరాలు, BHL, కాజా గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా
15) ఒక మైనర్ బాలుడు.
గడిచిన మూడు నెలల్లో 298 మందిపై 47 గంజాయి కేసులు నమోదు చేసి, 232 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.82.5 కేజీల ఘన గంజాయిని, 250 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 34 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.గుంటూరు జిల్లాలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు గౌరవ ఎస్పీ గారు తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుడు : A16 దొర, రాయగఢ్
సీజ్ చేయబడిన గంజాయి:- మంగళగిరి రూరల్ CI గారు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 4.2 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని సీజ్ చేసినరు. దాని విలువ షుమారు రూ.40,000 /- ఉంటుంది.
కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు.వారి వివరాలు:
1. మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ A.V. బ్రహ్మం గారు
2. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ SI Ch.వెంకటేశ్వర్లు గారు
3. ASI 2560, రత్న రాజు గారు
4. HC 2994, D. శ్యామ్ కుమార్ గారు
5. HC 3252, B. రామలింగేశ్వర రావు గారు,
6. HC 3674, చలమ రావు గారు
7. HC 3820, P. మణి కుమార్ గారు
8. PC 4157, సాగర్ బాబు గారు,
9. PC 4327, K.V. శ్రీనివాస రావు గారు
10. PC 4417, M. రాము గారు




