క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్
మహిళ సాధికారత కోసం రోటరీ పని చేస్తోంది
APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
తాడేపల్లి
*గర్భాశయ క్యాన్సర్ వల్ల కుటుంబాలకు కుటుంబాలే చిధ్రమవుతున్న తరుణంలో 2,300 మంది విద్యార్థులకు వారి తల్లితండ్రులను ఒప్పించి వ్యాక్సిన్ వేయించడం అద్భుతమని ఇది వారి కుటుంబాలలో వెలుగులు నింపుతాయని.. ఈ ఘనత సాధించిన రోటరీ క్లబ్ తాడేపల్లి వారిని APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అభినందించారు.*
*మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు తాడేపల్లి లోని వడ్డెశ్వరం డీజీపీ ఆఫీస్ పక్కన గోపు గ్రాండ్ కళ్యాణ మండపం నందు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో ప్రాజెక్ట్ శక్తి లో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా APMSIDC చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి ఎం హెచ్ ఓ అలానే జిల్లా వైద్య శాఖ సహకారంతో 50 మందికి పైగా సిబ్బందిని ఈ కార్యక్రమానికి పంపించామని అన్నారు. నన్ను ఇక్కడికి ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ శెట్టి రామకృష్ణకు, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్, జనసేన యువ నాయకుడు జొన్న రాజేష్ కు, క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి దగ్గరుండి వారికి వ్యాక్సిన్లు వేయించారు.. జిల్లా వైద్య యంత్రంగాంతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించారు.*
*ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రాంప్రసాద్, ఫాస్ట్ గవర్నర్ రవి వడ్లమాని, ప్రాజెక్ట్ శక్తి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తాళ్ల, డిస్టిక్ 3100 క్యాన్సర్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వందన బల్ల, రవీందర్ గుగాని, రోటరీ క్లబ్ తాడేపల్లి సెక్రటరీ శ్రావణి, ట్రజరర్ వెంకట నాగేష్, ప్రాజెక్ట్ చైర్మన్ జంగాల వెంకటేష్,పరుచూరి కిరణ్,రోటరీ సభ్యులు గోపు నాగరాజు, శ్రీకాంత్, జగదీష్, కాట్రగడ్డ శివన్నారాయణ, వివేకానంద రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ రమేష్, రోటరీ క్లబ్ సభ్యులు, విద్యార్థినిల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.*




