Home South Zone Andhra Pradesh గుంటూరులో పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ |

గుంటూరులో పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ |

0
0

గంజాయి సంబంధిత, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసులు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనుమానితుల, పాత నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా.
ఎటువంటి నేరాలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న పోలీసులు.

గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ IPS గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో గంజాయి మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా పోలీసు అధికారులు విస్తృత కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అదే విధంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనతో పాటు, ప్రజలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించుట లక్ష్యంగా “సంకల్పం” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ రోజు సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారి నేతృత్వంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని టిడ్కో గృహాల్లో మరియు
వెస్ట్ డిఎస్పీ శ్రీ అరవింద్ గారి నేతృత్వంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి, విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా డీఎస్పీ గార్లు మాట్లాడుతూ…
గంజాయి, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా నల్లపాడు మరియు నగరంపాలెం పోలీస్ స్టేషన్లలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల జాడ కోసం క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని టిడ్కో గృహాల్లో చేపట్టిన తనిఖీలలో భాగంగా మొత్తం 88 వాహనాలను పరిశీలించి, సరైన పత్రాలు లేని 8 వాహనాలను స్వాధీనం చేసుకుని, నిబంధనలు ఉల్లంఘించినందుకు 54 వాహనాలకు రూ.52,790/- విలువైన ఈ-చలానాలు విధించడం జరిగిందని సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు తెలిపారు.
అదే విధంగా నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో నిర్వహించిన తనిఖీలలో సరైన పత్రాలు లేని 32 వాహనాలను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో బాడీ వోర్న్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ డివైజ్‌లు, డ్రోన్ కెమెరాలు ఉపయోగించి,
* రౌడీ షీటర్లు,
* సస్పెక్ట్ షీటర్లు,
* గతంలో గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులను విచారించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు గట్టి నిఘా ఏర్పాటు చేశామని, గంజాయి అమ్మకం, వినియోగం మరియు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం డిఎస్పీ గార్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీటింగ్ నిర్వహించి, అక్కడి ప్రజలతో గంజాయి ఇతర మత్తు పదార్థాల వాడకం వలన కలిగే ఆరోగ్యపరమైన అనర్ధాలు గురించి, చట్టపరంగా ఎదుర్కొనే సమస్యల గురించి వివరించారు. యువత ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఒక్కసారి అలవాటైతే అది వ్యసనంగా మారి భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు.

స్కూళ్లులో, కాలేజీల్లో, పని ప్రదేశాలలో, తెలిసినవారు మరియు స్నేహితులకు గంజాయి ఇతర మాదకద్రవ్యాల వినియోగం వలన తలెత్తే సమస్యల గురించి వివరించాలని మనందరం గంజాయి రహిత గుంటూరు జిల్లా సాధన లక్ష్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.తదనంతరం అక్కడ సమావేశమైన ప్రజలతో “సంకల్పం” ప్రతిజ్ఞ చేయించారు.

గంజాయి అమ్మేవారు లేదా వినియోగించే వారి గురించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS