మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : “ప్రజా క్షేమమే మా ప్రథమ లక్ష్యం ” అని నినాదంతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు.
జగన్మాత ఆలయం, ఓల్డ్ గాబ్రియేట్ స్కూల్, మరియు వెంకట్రావుపేట పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ఆమె యుద్ధ ప్రాతిపదికపై స్పందించారు. కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా HMWSSB ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. మురుగునీరు పొంగిపొర్లుతున్న ప్రాంతాలను అంగుళం అంగుళం పరిశీలించి అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా సమస్యలు మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికార సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మురుగునీరు నిలిచిపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పారిశుద్ధ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అధికారుల వెంట శేఖర్, అరుణ, ప్రేమ్, సెంథిల్ వంటి పలువురు నాయకులు, మరియు కార్యకర్తలు, ఈ పర్యటనలో పాల్గొన్నారు.
తక్షణమే పనులు ప్రారంభం కావడంపై స్థానిక నివాసతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#sidhumaroju






