కర్నూలు సిటీ :
ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్నగరంలోని ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి పౌరుడు స్వచ్చందంగా నిషేధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరపాలక కార్యాలయం నుండి ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీ వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు చైతన్యం కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కౌన్సిల్ హాల్లో నమస్తే కార్యక్రమంలో భాగంగా మురుగునాళాలు, సెప్టిక్ ట్యాంకుల కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
ప్లాస్టిక్ వాడకం నిత్య జీవితంలో ఒక భాగమైందని, ఏ ఇంట్లో చూసినా ఇవి ఎక్కువగా కనబడుతున్నాయన్నారు. రీ సైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్ సంచులు అతిగా వాడి ఎక్కువగా పడేస్తున్నారన్నారు. దీంతో భవిష్యత్తులో చాలా ప్రమాదం సంభవిస్తుందని పర్యావరణ హితులు హెచ్చరిస్తున్నారన్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఫ్లెక్సీ తయారీలో వాడుతున్నారని..
. ముఖ్యంగా క్యాడ్మియం, సీసం వాడకం వల్ల అవి భూమిలో కరిగిపోవడంలేదని తెలిపారు. దీంతో జంతువులు తెలియక ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయన్నారు. ఏటా భారీ సంఖ్యలో పక్షులు, జీవులు ఈ ప్లాస్టిక్ బారిన పడి నశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, ఎస్‌ఈ విష్ణుమూర్తి, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కోఆర్డినేషన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.,






