Home South Zone Andhra Pradesh అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు

అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు

0

పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ కుమార్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపారు.

ఈ నేపథ్యంలో నాలుగు మండలాలలోని స్టేషన్లను మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చేర్చారు. ఇది డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చినట్లు భావించాలని విజయ్ కుమార్ పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version