అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనున్న సుంగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జాతర పరిసరాలలో అదనపు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ మీడియాకు వెల్లడించారు# కొత్తూరు మురళి.
